You are here

ఉచితంగా రోబోటిక్స్ పై శిక్షణ

జిల్లాలోని 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు కలిగిన ఇంటర్,డిగ్రీ ఇంజనీరింగ్,పీజీ నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచితంగా 'రొబోటిక్స్' పై శిక్షణ ఇవ్వనున్నట్లు జె .రోబోటిక్స్  సంస్థ ప్రతినిధి కే.శ్రావణ్ కుమార్ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇస్తామన్నారు. రోబోటిక్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ కోర్సుల్లో 6 నెలల పాటు కోరంగి కైట్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ఈ శిక్షణ జరుగుతుందన్నారు. శిక్షణ అనంతరం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపారు. ఎంపికైన వారికి రూ. 12 వేలు నుంచి రూ. 20 వేలు జీతం వచ్చేలా ఉపాధి అవకాశాలు చూపిస్తామని తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ నిరుద్యోగ యువత, ఆధార్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లతో కైట్ కళాశాలలోని శిక్షణ కేంద్రం వద్ద ఈనెల 20 వ తేదీ లోపుగా సంప్రదించాలని సూచించారు. శిక్షణ సమయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉచిత లాప్టాప్, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 9100900137 నంబరుకు సంప్రదించవలసిందిగా కోరారు. 

Advertisement

Sankranthi Sambaralu
Birthday Flash Demo