You are here

నేడు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా కాకినాడలో ర్యాలీ

News Desk - Kakinada9:

నేడు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి సూచన మేరకు జిల్లా మలేరియా అధికారిని మరియు జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ వారిద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ వారు మాట్లాడుతూ ఈ వ్యాధి ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు వలన ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాప్తి చెందుతుందని ఈ వ్యాధివల్ల జ్వరము, తలనొప్పి, కండరాలు మరియు కీళ్ళ నొప్పులు, చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమతెరలు. మస్కిటో కాయిల్స్ వాడాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డెంగ్యూ నిర్మూలన కోసం జిల్లావ్యాప్తంగా నగరపాలకసంస్థ పట్టణం మరియు నగర పంచాయితీ, గ్రామపంచాయతీలో ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం జరిగినదని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి చికిత్స కొరకు ముందస్తు చర్యలు తీసుకొనుట జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటా మాలజీ శ్రీ కె వి ఎస్ ప్రసాద్, జిల్లా మలేరియా అధికారిని శ్రీమతి ఎమ్.తులసి, జిల్లా కన్సల్టెంట్ శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు, కాకినాడ సబ్ యూనిట్ అధికారి శ్రీ వై.నాగబాబు, సబ్ యూనిట్ అధికారి శ్రీ ప్రసాద్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

© Kakinada9.com 2018. All Rights Reserved

Advertisement

Share this content.