You are here

Anna Canteens inaugurated today at Kakinada

Anna Canteens inaugurated at Vivekananda Park Kakinada

Anna Canteens inaugurated at Vivekananda Park and Dairy farm centre at Kakinada today by Collector Kartikeya Mishra, Kakinada City MLA Vanamaadi Venkateswara Rao, Kakinada Rural MLA Pilli Anantalakshmi, Kakinada Mayor Sunkara Pavani. Anna canteens will serve Breakfast, Lunch and Dinner at Rs.5/- only.

 

 

anna-canteen-kakinada-1.jpg

 

కాకినాడలో ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు 

కాకినాడ నగరంలో 5 రూపాయలకే నాణ్యమైన ఆరోగ్యకరమైన అల్పాహారం భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన క్యాంటిన్లు పేదవర్గాలకు ఎంతో ప్రయోజనకరమని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.

 

anna-canteen-kakinada-4.jpg

 

నేడు ఉదయం రాష్ట్రస్థాయిలో విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను ప్రారంభించిన అనంతరం జిల్లా స్థాయిలో స్థానిక బాలత్రిపుర సుందరి దేవాలయం సమీపంలో వివేకానంద పార్క్ లో ఏర్పాటు చేసిన అన్న కాంటీన్ జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి, నగర మేయర్ సుంకర పావని సంయుక్తంగా ప్రారంభించారు.

 

anna-canteen-kakinada-3.jpg

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ తక్కువ ధరలో నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో పేదలకు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను చేపట్టిందని ఇందులో భాగంగా స్మార్ట్ సిటీ కాకినాడ నగరంలో తొలివిడతగా వివేకానంద పార్క్ డైరీ ఫార్మ్ సెంటర్లలో ఈ క్యాంటిన్లు ప్రారంభించామని నగరంలోని పేద అల్పాదాయ ప్రజలు వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

anna-canteen-kakinada-2.jpg

 

పచ్చని పరిశుభ్రమైన వాతావరణంలో ఈ క్యాంటిన్లు నిర్వహిస్తున్నామని వీటి సేవల నాణ్యతను ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజలను అడిగి తెలుసుకొని మరింత మెరుగు దిద్దడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చే అక్షయ పాత్రలుగా అన్నా క్యాంటీన్ లను అభివర్ణించగా అన్నా క్యాంటీన్ల సేవలను నగరంలోని పేదవర్గాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు కోరారు. నగరంలో త్వరలోనే మరిన్ని ప్రాంతాలలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేపడతామని నగర మేయర్ సుంకర పావని తెలిపారు. అనంతరం డైరీ ఫారం సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కె శివ పార్వతి, ఎస్ఈ విజయ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రమేష్ కుమార్, నగర ప్రముఖులు పిల్లి సత్యనారాయణమూర్తి,  సుంకర తిరుమల కుమార్, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Share this content.