You are here

బధిరులకు ఉచితంగా కాక్లియర్ పరికరములు

News Desk - Kakinada9:

భారత ప్రభుత్వం వారి సూచనల మేరకు కమిషనరు, విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ వారు 12 సంవత్సరముల లోపు బధిరులకు శస్త్ర చికిత్స చేసి కాక్లియర్ పరికరములు భారత ప్రభుత్వం వారి నిధులతో ఉచితంగా అమర్చేదరని అర్హులైన బధిరులు ఈ పధకం ఉపయోగించుకోవాలని తెలిపారు. సదరు కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్ర చికిత్స కొరకు 40శాతం వికలాంగత్వం కలిగి 12 సంవత్సరములు లోపు వారు తల్లి తండ్రుల నెలసరి ఆదాయం రూ.20,000/- ల లోపు మరియు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి అని తెలియజేసారు. అర్హులైన బధిరులు సంబంధిత ప్రభుత్వ ENT ఆసుపత్రులు మరియు జిల్లాలోని బధిరుల స్వచ్ఛంద సంస్థల వారిని సంప్రదించాలని, ఇతర వివరాలకు నోడల్ ఆఫీసర్ డాక్టర్ రత్నకుమార్ 8286157500, sarathna@yahoo.com.in కు సంప్రదించాలని కోరారు.

© Kakinada9.com 2018. All Rights Reserved

For contributing, News/Articles mail us at support@kakinada9.com or call us at +91-833-18-18-833
Follow us on Facebook, Twitter, Instagram, Youtube /kakinada9

Advertisement

Share this content.

Rockstar Travels