You are here

Kakinada RDO L. Raghu Babu observed land acquisition for the National Highway - Sagaramala Project

Kakinada RDO L. Raghubabu Observed the Kakinada Rural Zone this morning at Vakalpada and Suryavu Peta Village to accelerate the land acquisition activities of National Highway Construction Works under the Central Government's proposed Sagarmala project to be developed from the Kakinada Port to Annavaram at Sankavaram Mandal. The Kakinada Divisional Officer said Kakinada Rural and Upada Kottapalli Mandal in which 650-acre land related project to construct a national highway of 53 km. Therefore, the RDO L. Raghu Babu of Kakinada ordered to speed up the land acquisition activities for the construction of the National Highway.

 

సాగరమాల జాతీయ రహదారికి - భూసేకరణ పనులను పరిశీలించిన కాకినాడ ఆర్.డి.వో ఎల్.రఘుబాబు

 

Sagaramala.jpg

 

          కాకినాడ పోర్టు నుండి శంఖవరం మండలము అన్నవరం వరకు నిర్మించ తలపెట్టిన పోర్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వము నిర్ధేశించిన సాగరమాల ప్రాజెక్టు క్రింద నిర్మించతలపెట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతము చేయడములో భాగముగా కాకినాడ ఆర్.డి.వో ఎల్.రఘుబాబు ఈ రోజు ఉదయము కాకినాడ రూరల్ మండలము వాకలపూడి మరియు సూర్యారావు పేట గ్రామము నందు భూసేకరణకు సంబంధించి రోడ్డు సరిహద్దులను (పెగ్ మార్కు) పనులను పరిశీలించిన ఆర్.డి.వో రఘుబాబు మాట్లాడుతూ కాకినాడ డివిజిన్ నందు కాకినాడ రూరల్ మరియు ఉప్పాడ కొత్తపల్లి మండలము సుమారు 650 ఎకరముల భూమి సంబంధిత సాగరమాల ప్రాజెక్టు క్రింద జాతీయ రహదారి నిర్మాణమునకు భూసేకరణ చేయవలసియున్నదని సదరు జాతీయ రహదారిని 53 కిలోమీటర్లు మేరకు నిర్మాణము జరపవలసియున్నదని తెలిపియున్నారు. 

 

కావున సదరు జాతీయ రహదారి నిర్మాణమునకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతము చేయాలని కాకినాడ ఆర్.డి.వో ఎల్.రఘుబాబు తెలిపియున్నారు. ఈ యొక్క భూసేకరణ పనుల పరిశీలనలో ఆర్.డి.వో వెంట కాకినాడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎం.శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ తహశీల్దార్ పి.వి.సీతాపతిరావు, మండల సర్వేయర్ శ్రీనివాసు, డిప్యూటీ తహశీల్దార్ జె.వి.ఆర్.రమేష్ మరియు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Share this content.