You are here

తూర్పుగోదావారి జిల్లాలో 886 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు - కలెక్టర్ కార్తికేయ మిశ్రా

News Desk - Kakinada9:

జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన మెగా పరిశ్రమలు సత్వర ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. నేడు జిల్లా కలాక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహాకమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 4 మెగా పరిశ్రమలకు 886 కోట్ల వ్యయంతో 4840 మందికి ఉపాధి కల్పించడానికి లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఈ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహాన్ని పరిశ్రమల శాఖ ద్వారా అందజేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో సింగిల్ డెస్క్ విధానం ద్వారా పరిశ్రమల అనుమతులు జారీలో భాగంగా 553 దరఖాస్తులు రాగా వీటిలో 531 దారకాస్తులు వివిధ శాఖల ద్వారా అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో అనుమతించిన భారీ మరియు మెగా పరిశ్రమలు జూన్ నెల నాటికి గ్రౌండింగ్ చేసి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.

 ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ ఎ.వి.పటేల్, ఉప సంచాలకులు డేవిడ్ సుందర్ కుమార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బివి.సుబ్రహ్మణ్యం, టౌన్ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ డి.ఎస్.ఎస్.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

© Kakinada9.com 2018. All Rights Reserved

For contributing, News/Articles mail us at support@kakinada9.com or call us at +91-833-18-18-833
Follow us on Facebook, Twitter, Instagram, Youtube /kakinada9

Advertisement

Share this content.