You are here

National Handloom Day held at Kakinada

The 4th National Handloom Day was held at Kakinada today. A Rally "Chenetha Nadaka" was conducted from Elvinpet to Gandhinagar to show the importance of Handloom. 

 

national-handloom-2.jpg

 

కాకినాడలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

4వ జాతీయ చేనేత దినోత్సవం నేడు జిల్లాలో సహాయ సంచాలకులు (చే&జౌ) కాకినాడ వారు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని (50) చేనేత సహకార సంఘం అధ్యక్షులు, కమిటీ మెంబర్లు, చేనేత కార్మికులు, ప్రతినిధులు మరియు సహాయ సంచాలకులు, అభివృద్ధి అధికారులు, సహాయ అభివృద్ధి అధికారులు ఏళవింపేట లోని తమ కార్యాలయం వద్ద నుండి గాంధీనగర్ మహాత్మ గాంధీ విగ్రహం కొరకు చేనేత విశిష్టతను తెలియజేస్తూ నినాదాలు చేస్తూ 'చేనేత నడకను' నిర్వహించారు.

 

national-handloom-1.jpg

 

తదుపరి డా.బి.ఆర్.అంబేద్కర్ సామాజిక భవనం గాంధీనగర్ నందు నిర్వహించిన సమావేశంలో అనుభవజ్ఞులు, దీర్ఘకాలం సంఘానికి సేవచేసిన చేనేత కళాకారులను ఎంపిక చేసి వారికి సన్మానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి డా. పాండురంగారావు, డి.సి.సి.బి ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. ధర్మారావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ డిసిసిబి, ఆప్కో డివిజినల్ మార్కెటింగ్ అధికారి రామకృష్ణమూర్తి, జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్లు, చేనేత సహకారం సంఘాల అధ్యక్షులు, మెంబర్లు, చేనేత ప్రతినిధులు పాల్గొని జాతీయ చేనేత దినోత్సవం విజయవంతం చేశారు.
 

 

Advertisement

Share this content.