You are here

Open School Exams will commence from 11th July

The intermediate examination conducted by the Andhra Pradesh Open School Society will be conducted from 11th to 21th of this month. The exams will be from 2 pm to 5 pm, Joint Collector said. 994 students applied for the 10th Class exams and 4 exam centers allotted for them. 2253 students applied for the Intermediate, 8 exam centers allotted for them. Joint Collector ordered revenue officials to enforce Section 144 of at the Examination Centers.

ఈ నెల 11 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ వారు నిర్వహించే ఇంటర్మీడియట్ పదవతరగతి పరీక్షలు ఈ నెల 11వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు పారదర్శకంగా జరపాలని జాయింట్ కలెక్టర్ ఏ.మల్లికార్జున జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షలకు పదవతరగతికు 994 మంది దరఖాస్తు చేశారని 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు అలాగే ఇంటర్మీడియట్ కు 2253 మంది విద్యార్థులు దరఖాస్తు చేసారని 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసే విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకొని వెళ్ళుటకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజమహేంద్రవరం వారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఈవో ఎస్ అబ్రహం, డిప్యూటీ డీఈవో కాకినాడ సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Share this content.