You are here

నేడు కాకినాడలో అర్జీలు, పిర్యాదులు స్వీకరించిన SC, ST కమిషన్ చైర్మన్ కారెం శివాజీ

News Desk - Kakinada9:

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయి వరకు ప్రజలకు వాటి ఫలాలు అందేలా కృషి చేస్తామని ఎస్సి ఎస్టి కమిషన్ చైర్మన్ కారం శివాజీ పేర్కొన్నారు. నేడు ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఎస్సి ఎస్టి ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ వ్యక్తిగత ఆర్జీలను ఫిర్యాదులను కమిషన్ చైర్మన్ కారెం శివాజీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు చేపడతామన్నారు. మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా 12వ తేదీన ఉదయం ఎస్సీ ఎస్టీ అర్జీలు ఫిర్యాదులు స్వీకరించి మధ్యాహ్నం అన్ని శాఖల అధికారులతో సమీక్షిస్తామన్నారు. 13వ తేదీన జేఎన్టీయూకే ఆదికవి నన్నయ యూనివర్సిటీ లు సందర్శించి తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. 14వ తేదీన ఐటిడిఎ రంపచోడవరం చింతూరు లలో పర్యటించి దళిత గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమీషన్ సెక్రెటరీ సుబ్బారావ్, ఐఎఎస్, డైరెక్టర్ నాన్ రావు, సభ్యులు సుధారాణి, సివేరి, సోమనరహరి, వరప్రసాద్, బి.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

© Kakinada9.com 2018. All Rights Reserved

Advertisement

Share this content.