You are here

Special Sanitation Drive held at 14 divisions in Kakinada

Special Sanitation Drive held at 14 divisions in Kakinada. To prevent Infectious diseases, Seasonal Diseases and control of mosquitoes in the city special sanitation drive conducted in 14 divisions under Kakinada Municipality Corporation.

 

sanitation-kakinada_0.jpg

 

కాకినాడలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమము

కాకినాడ నగరంలో అంటువ్యాధులు వ్యాపించకుండా సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా దోమల నియంత్రణ చేయుటకు కార్యాచరణ రూపొందించవలసిందిగా గౌరవ మేయర్ వారు, జిల్లా కలెక్టర్ వారు, కమిషనర్ వారు ఈ నెల 4వ తేదీన సమావేశంలో ఆదేశించిన విధముగా  14 సానిటరీ సర్కిల్స్ నందు నేడు 14 డివిజన్లలో “ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమము” గౌరవ కార్పొరేటర్ల వారి సూచనల మేరకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వారు, శానిటరీ సూపర్వైజర్ వారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వారి ఆధ్వర్యములో పారిశుద్ధ కార్యక్రమములు అనగా నిల్వ వున్న మురికి నీటిలో ఆయిల్ బాల్స్ వేయుట, ఎమ్. ఎల్ ఆయిల్ వేయుట, కాలువలో తెమోపాస్, ఎమ్.ఎల్ ఆయిల్ వేయించుట సిల్ట్ తీయించుట చేపట్టినారు.  ఈరోజు సుమారు 600 లీటర్లు ఎమ్ ఎల్ ఆయిల్, 20 ఆయిల్ బాల్స్, సుమారు 8 కిమీ చిన్న కాలువలలో సిల్ట్ తీయించారు. మరియు 13 కి. మీ క్లీన్ స్వీపింగ్ చేయించారు. రోడ్డు మార్జిన్లలోనూ కాలువలపై ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. ప్రజలకు దోమల నిర్ములనపై కర పత్రములు పంచారు.

 

Advertisement

Share this content.