You are here

అక్టోబరు 2 నుంచి చంద్రన్న బీమా పథకం అమలు

మంగళవారం ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. చంద్రన్న బీమా పథకంకు సంబంధించి ప్రమాదాల్లో మరణించిన వారి వివరాలు నిశితంగా పరిశీలించడం జరుగుతుందని, ప్రమాద మరణాల విషయంలో తప్పుడు సమాచారంతో బీమా పొందాలని ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయి.చంద్రన్న బీమా పథకం అమలుకు కచ్చితమైన సమాచారాన్ని కాల్‌ సెంటర్‌కు తెలియజేయాలని డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు తెలిపారు. ప్రమాదం స్థలంలో ఫొటోలు తీయించాలని, పత్రికల్లో ప్రచురితమైన వార్తను జత చేయాలని, పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఆర్‌ పత్రం, మధ్యవర్తుల రిపోర్టు, శవపంచనామా జరిగిన ఆసుపత్రి వివరాలు పూర్తిగా అందజేయాలని సూచించారు. వీటన్నింటిని చంద్రన్న బీమా కాల్‌ సెంటర్‌, మండలంలోని బీమా మిత్రకు అందజేయాలి. ప్రమాద మరణం సంభవించినప్పుడు కాల్‌సెంటర్‌ 0884-2353111, 9849901694 ఫోన్‌ నంబర్లకు తెలియజేయాలని సూచించారు.ఇప్పటి వరకూ ప్రమాద బీమాకు సంబంధించి 21 కుటుంబాలకు మొత్తం ఆన్‌లైన్‌ విధానంలో ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున చెల్లించినట్లు, సాధారణ మరణాలకు సంబంధించి 1,584 కుటుంబాలకు పరిహారం సొమ్ము వారి బ్యాంకు ఖాతాలకు జమచేశామన్నారు.

Write a review

or login with

SVSR Technologies
Koushiki Properties
Prakruthi
Sri Kalki Matrimony