You are here

ఆరోగ్య రక్ష

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు వైద్యసేవలు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి ‘ఆరోగ్య రక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎన్టీఆర్‌ వైద్యసేవ జిల్లా సమన్వయకర్త కె.రాజు తెలిపారు.తెల్లరేషన్‌ కార్డు ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు. లబ్ధిదారులకు రూ.2 లక్షల వార్షిక ఆరోగ్య బీమా వర్తిస్తుందని, సంవత్సరానికి ఒక వ్యక్తికి రూ.1200 వార్షిక ప్రీమియంతో హెల్త్‌కార్డులను అందిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28లోపు ప్రీమియం చెల్లించాలి.  కార్యక్రమ విధివిధానాలను ఆయన కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఎన్‌టిఆర్‌ వైద్యసేవ, ఉద్యోగుల ఆరోగ్యపథకం, పాత్రికేయుల ఆరోగ్య పథకం పరిధిలోకి రాని ప్రజల కోసం ప్రభుత్వం ‘ఆరోగ్య రక్ష’ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా జిల్లాలో ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పరిధిలో ఉన్న 48 ఆసుపత్రులలో వైద్యసేవలు పొందవచ్చని, లబ్ధిదారులకు ఎటువంటి వయోపరిమితి లేదని తెలిపారు. గడువు మధ్యలో జన్మించిన శిశువులకు బీమా ముగిసే చివరి నెల వరకు నెలకు రూ.100 చొప్పున చెల్లించి లబ్ధి పొందవచ్చన్నారు. అర్హులైనవారు ఎన్‌టిఆర్‌ వైద్యసేవ వెబ్‌సైట్‌, ప్రజాసాధికారసర్వే వెబ్‌సైట్‌, మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబరు 104లేదా 83338 17469 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Post new comment

or login with

Sri Kalki Matrimony
Prakruthi
SVSR Technologies
NSquare Play school side ad