You are here

NTR Beach Festivel in Kakinada

''THE KAKINADA NTR BEACH FESTIVAL'' on Jan 12, 13, 14, 15, will be held.in this occasion youngsters those who are interested in Music, Mimicri, Musical Instruments, they have to be apply Application forms in this month within 5th at  Setraj CEO Email:setrajkkd2013@gmail.com     

ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసా సామ్యూల్‌ దివాకర్‌ ఇచ్చిన పిలుపు మేరకు సాగర సంబరాల విధులకు దూరంగా ఉండాలని తీర్మానించారు.ఈనెల 12 నుంచి 15 వరకూ కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌లో నిర్వహించనున్న సాగర సంబరాల విధులకు దూరంగా ఉండాలని రెవెన్యూ ఉద్యోగులు నిర్ణయించారు. మంగళవారం రాత్రి స్థానిక రెవెన్యూ భవన్‌లో కాకినాడ డివిజన్‌ రెవెన్యూ, కలెక్టరేట్‌ యూనిట్‌ ఉద్యోగులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.  సంప్రదాయ పండుగైన సంక్రాంతిని జరుపుకోకుండా సాగర సంబరాల విధులు నిర్వహించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ మూడు రోజులు ప్రొటోకాల్‌, ఇతర విధులు నిర్వహించకూడదని నిర్ణయించారు. ఇతర శాఖల ఉద్యోగులతో సాగర సంబరాల విధులు నిర్వహించినా మాకు అభ్యంతరంలేదని తేల్చిచెప్పారు. మేము ఎవరికీ వ్యతిరేకం కాదని, పండుగ నేపథ్యంలోనే సాగర సంబరాల విధులకు హాజరుకాలేమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు. సమావేశానికి తహసీల్దారు నుంచి వీఆర్‌ఏ వరకూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

Koushiki Properties
Sri Kalki Matrimony
Prakruthi
SVSR Technologies