• జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 29 మంది ఫిర్యాదులు వచ్చాయి. అదనపు ఎస్పీ(పరిపాలన) ఎస్‌వీ శ్రీధరరావు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతిఒక్కరి సమస్యను విన్న ఆయన సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను ప్రతీ సోమవారం ఇక్కడ అందించవచ్చని తెలిపారు.