You are here

37th APMSRU General Conference will begin today at Suryakalamandir Kakinada

37th APMSRU General Conference will begin today at Suryakalamandir Kakinada

 

 

 

 

 

 

 

 

 

కాకినాడలోని సూర్యకళామందిరంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ (ఏపీఎంఎస్‌ఆర్‌యూ) 37వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్‌ శేఖరరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక సూర్యకళా మందిరం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు కాకినాడ, బాలాజీచెరువు కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మహాసభలకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరసింగరావు, ఎంఏ గపూర్, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ, ఎఫ్‌ఎంఆర్‌ఏఐ జాతీయ అధ్యక్షుడు రమేశ్‌సుందర్‌ తదితరులు హాజరవుతారన్నారు. పభుత్వ వైద్యరంగ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాసభల్లో మందుల కంపెనీల యాజమాన్యాలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏజీ రాజమోహన్, రాష్ట్ర కోశాధికారి ఎ.ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Share this content.