• జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అద్నాన్‌ నయీమ్‌ అస్మి కాకినాడలోని జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిదఫా నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. కొంత మంది పోలీసు అధికారులతో అక్కడి నుంచే ఫోనులో మాట్లాడి తగిన సూచనలు చేశారు. ప్రతి ఫిర్యాదుదారుకు ఇచ్చిన అర్జీని పరిష్కరిస్తామన్నారు.