• Collector D Muralidhar Reddy said 9 district level officials have been appointed to oversee flood relief programs. In the wake of the Godavari floods and the surrounding villages and the surrounding villages have been affected by the floods.Collector ordered the District Medical, Health, Superintendent Engineer, Rural Drinking Water Supply Department, Port Officer Kakinada, District Civil Relations Officer, DM Civil Supply, Deputy Transport Commissioner, District Panchayat Officer, District Fire Officer to stay at Rampachodavaram and continue the relief programs till the situation becomes normal.


    Four and a half metric tonnes of onions and four and a half metric tonnes of potatoes were sent by lorries on Sunday through the Supplies Department. These will be provided to flood victims in Devipatnam, the collector said. The collector also mentioned that by Sunday there will be a supply of essential items in flood relief centers.

     

     

    గోదావరి వరద నీటి ప్రవాహం స్థాయి పెరుగుతున్న దృశ్యం వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించటానికి తొమ్మిది మంది జిల్లా స్థాయి అధికారులను నియమించడం జరిగిందని కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. గోదావరి వరదలు దృశ్య దేవీపట్నం తో పాటు పరిసర గ్రామాలు ముంపుకు గురవుతున్న నేపథ్యంలో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేసే విధంగా అధికారులను పంపడం జరిగిందన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి, సూపరింటెండెంట్ ఇంజనీరు గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగం, పోర్ట్ ఆఫీసర్ కాకినాడ, జిల్లా పౌరసరఫరాల అధికారి, DM సివిల్ సప్లై, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా అగ్నిమాపక అధికారి రంపచోడవరం లో మకాం చేసి సాధారణ పరిస్థితులు వచ్చే వరకు విధులు నిర్వహించాలని కలెక్టర్ తొమ్మిదిమంది అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


    సరఫరాల శాఖ ద్వారా రాజమహేంద్రవరం నుండి రంపచోడవరం నాలుగున్నర మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు , నాలుగున్నర మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు ఆదివారం లారీల ద్వారా పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వీటిని దేవీపట్నంలో వరద సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆదివారం నాటికి వరద సహాయక కేంద్రాలు లో నిత్యవసర వస్తువుల పంపిణీ ఉంటుందని కలెక్టర్ తెలిపారు.