• నవరత్నాల్లో మొదటి విడతగా జిల్లాలోని 220 ఫీడర్ల పరిధిలో వ్యవసాయ రంగానికి సోమవారం నుంచి పగటిపూట 9 గంటలు విద్యుత్తు సరఫరా చేసేందుకు నిర్ణయించినట్లు రాజమహేంద్రవరం సర్కిల్‌ ఎస్‌ఈ సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెండు గ్రూపులుగా విడదీసి ఏ గ్రూపునకు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, బీ గ్రూపునకు ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలు అవసరమైన మరో 98 ఫీడర్ల పరిధిలో పగటిపూట విద్యుత్తు సరఫరా చేసేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటివరకు ఈ 98 ఫీడర్ల పరిధిలో ప్రస్తుత సరఫరా వేళలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులందరూ ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.