You are here

Aadhar must be linked to Bank Accounts for Upaadhi Haami Scheme

Aadhar must be linked to Bank Accounts for Upaadhi Haami Scheme

 

 

 

 

కాకినాడ ఆర్.డి.ఓ ఎల్.రఘుబాబు అద్యక్షతన ఈ రోజు మద్యాహ్నము 3.00 గంటలకు రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయములో జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించి కాకినాడ డివిజన్ ఎ.పి.ఓ. లు మరియుకంప్యూటర్ ఆపరేటర్స్ లతో సమీక్షా సమావేశము నిర్వహించినారు. సదరు సమావేశములో ఆర్.డి.ఓ మడ్లాడుతూ కాకినాడ డివిజనల్ లో జాతీయ ఉపాది హమీ పదకము ద్వారా కూలీల సంఖ్యను గణనీయముగా పెంచుటకు గాను ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఉపాధి హామీ కనీస వేతనమును 205 రూపాయలకు తక్కువ కాకుండా వేతనము అమలు జరగాలని అదేవిధముగా జాతీయ ఉపాధి హామీ పధకములో సస్పెండడ్ మరియు రిజక్టడ్ వేతనములు కోసం మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంటు నిర్మాణాలు మరియు సోక్ పిట్స్ త్వరితగతిన పూర్తిచేయుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎ.పి.ఓ. లు మరియు కంప్యూటర్ ఆపరేటర్స్ కు ఆదేశించియున్నారు. ఈ యొక్క సమావేశములో ఎ.పి.డి జి.రమేష్, క్లస్టర్ టి.ఎ శివ ప్రసాద్, కె.ఎస్.వి.సుబ్బారావు, ఎ.పి.ఓ. లు మండల కంప్యూటర్ ఆపరేటర్స్ పాల్గోన్నారు.

Advertisement

Share this content.