• Location
    Cinema Hall Road, Kakinada
  • Tags
  • కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ శ్రీ సిహచ్.నాగ నరశింహారావు గారు ఈరొజు వారి యొక్క బాహ్య విధులలో భాగంగా రామ మోహన్ రాజ నగర్, పళ్లంరాజు నగర్ డివిజన్ ల నందు పారిశుధ్యం పనులను తనిఖి చేసినారు.అక్కడి ప్రజలతో కలసి సదరు డివిజన్ల యందు పారిశుధ్యం ఎట్లు జరుగుచున్నదో తెలుసుకోనినారు. మైక్రో పాకెట్లు నిర్వహణలో భాగంగా పారిశుధ్య పనివారలు ప్రతిరోజు డోర్ టు డోర వెళ్లి చెత్తను సేకరించాలి అని మరియు అన్ని ప్రదేశములను పరిశుభ్రంగా ఉంచవలెనని, కాలువలలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించి మురుగు నీర కాలువలద్వారా సక్రమంగా పారునట్లుగా చేయవలెనని సిబ్బందిని ఆదేశించినారు. నగర మురికివాడలు పారిశుధ్య విషయంలో ఎటువంటి అలసత్వం వహించరాదని, అందరు సిబ్బంది భాద్యత గా పనిచేసి కాకినాడ నగర ప్రజలకు మెరుగైన సేవలు ద్వారా ఆరోగ్య కరమైన వాతావరణమును కలిగించ వలసినదిగా తెలియపరచారు. ఈ పర్యటనలో అదనపు కమీషనర్ వారితో పాటు శానిటరీ సుపరవైజరు,సంభ౦దిత వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ , ఇతర సిబ్బంది పల్గోనినారు.