You are here

'Anandam Ambaramaithe' Movie Shooting at Kakinada

'Anandam Ambaramaithe' Movie Shooting at Kakinada.

 

anandam-ambaramaithe.jpg

 

కాకినాడ నగరంలో సినీ సందడి 
SB మూవీస్ నిర్మాణసారధ్యంలో సుబ్బు ఈరంకి దర్శకత్వం వహిస్తున్న "ఆనందం అంబరమైతే " సినిమా షూటింగ్ సందడి చేసింది . కాకినాడ సంజీవ నగర్ గొడౌన్స్ వద్ద జబర్దస్త్ అనీల్  బృందం తో ఫైట్ చిత్రీకరిస్తున్నారు . ఈ సంధర్బంగా  దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలలో పూర్తి స్థాయి పల్లెటూరు వాతావరణంలో గోదావరోళ్ళ ప్రేమ , అభిమానాలు , ఆత్మీయతలు , చమత్కారం మేళవించి అన్నితరగతుల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమా నిర్మిస్తున్నామన్నారు .  9৪ శాతం సినిమా షూటింగ్ పూర్తి చేశారని , 2రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని సుబ్బు తెలిపారు . బుద్దాల సత్యనారాయణ నిర్మాతగా 30 ఇయర్స్ పృద్దీ ప్రధానపాత్రలో కాకినాడ నాని , సురేష్ , మధు , వెంపటాపు , మాస్టర్ చిలకచర్ల కిశోర్ చంద్ర , మాస్టర్ బుద్దాల చైతన్య నాయుడు , నాగలక్ష్మి లు నటిస్తున్నారు . ఈ షూటింగ్ లో కో,డైరక్టర్ జాన్ , కెమేరామెన్ చైతన్య ,  డ్రోన్ ఉమాప్రసాద్ , వినయ్ , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Share this content.