You are here

AP CM Chandrababu Naidu will Tour Kakinada Tomorrow

AP CM Chandrababu Naidu will Tour Kakinada Tomorrow and Participate in Janmabhumi - Maa Ooru 2019 and also Inaugurate the Development Works at Kakinada Smart City.

 

 

 

 

 

 

రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లాలో జరిపే పర్యటన సందర్భంగా 4,270 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.
నేడు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కలెక్టరేట్ కోర్టు హాల్లో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి జరిపే పర్యటన వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 10:30 గంటలకు హెలికాప్టర్లో జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు అన్నారు. అనంతరం జేఎన్టీయూ గ్రౌండ్ లో నిర్వహించే జన్మభూమి మా వూరు కార్యక్రమంలో పాల్గొని అదే ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని లబ్ధిదారులకు సంక్షేమాలు, ఆస్తులు పంపిణీ చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా ఆయన 3000 కోట్లతో నిర్మించనున్న జిఎంఆర్ గేట్వే పోర్ట్, శ్రీకాకుళం కాకినాడ ఏపీ జిడిసి గ్యాస్ పైప్ లైన్, 292 కోట్లతో రాజానగరం - కాకినాడ ఎడిబి రోడ్డు విస్తరణ, 400 కోట్లతో కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, 296 కోట్లతో ఏలేరు నీటిపారుదల వ్యవస్థ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే హల్దియా రెఫైనరీతో 6 వేల కోట్ల ప్రాజెక్ట్ నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందం కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా జడ్పి జనరల్ బాడీ సమావేశంలో ప్రత్యేక అతిథిగా హాజరవుతారని అలాగే శతాబ్ది వేడుకల పైలాన్, ఎన్టీ రామారావు విగ్రహాలను ఆవిష్కరిస్తారని తెలియజేశారు. తదుపరి నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభిస్తారన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన కాకినాడ కత్తిపూడి 216 జాతీయ రహదారి, ఏలేరు రిజర్వాయర్లను హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ తిలకించి రామవరం లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు అన్నారు. రామవరం లో 682 కోట్లతో నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండవ దశను ప్రారంభించి, మల్లవరం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారని అలాగే రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తదుపరి జగ్గంపేట చేరుకొని నూతనంగా నిర్మించిన డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించి అనంతరం సాయంత్రం 4 30 గంటలకు బయలుదేరి హెలికాప్టర్ లో అమరావతి వెళతారని తెలిపారు.

Advertisement

Share this content.