• గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి సాంఘిక సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 5 నుంచి 9వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా సమన్వయకర్త రాధ సుధా వాణి ఒక ప్రకటనలో తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ ఇంటర్ లో మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు విద్యార్థులకు మరో దఫా దరఖాస్తు చేసేందుకు 22వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://jnanabhumi.ap.gov.in/ వెబ్సైట్లో వివరాలు పూర్తి చేసి దరఖాస్తులు సమర్పించాలని వెల్లడించారు. ఇతర సమాచారం కోసం సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.