• జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు-2018కు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ఎస్‌.అబ్రహం తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్, పురపాలక, సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ, కేవీ, జేన్‌వీ, సీటీఎస్‌ఏ పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఒప్పంద, పొరుగుసేవల ఉపాధ్యాయులు అర్హులు కాదని పేర్కొన్నారు. స్వీయ ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో ఈనెల 15లోగా పంపుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తులను పంపేందుకు, ఇతర వివరాలకు www.mhrd.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చన్నారు.