You are here

10వ తరగతి పరీక్షలకు APSRTC ఉచిత ప్రయాణ సౌకర్యం

News Desk - Kakinada9:

జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థిని, విద్యార్థులకు APSRTC బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు RTC రీజినల్ మేనేజర్ చింత రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి 28 వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షల హల్ టికెట్ చూపించి వారి నివాస ప్రాంతం నుంచి పరీక్ష కేంద్ర వరకు వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. దూరం, పాసులో పేర్కొన్న గమ్యస్థానాలతో ప్రమేయం  లేకుండా పరీక్ష కేంద్రం వరకు బస్సుల్లో అనుమతిస్తున్నామన్నారు. పరీక్ష కాలం 13 రోజుల వ్యవధిలో ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలున్నాకాని ఉచిత ప్రయాణానికి పాస్ ఉన్న వాళ్ళను అనుమతిస్తారన్నారు. హాల్ టికెట్ రాయితీ బస్సు పాసును చూపించి కాంబినేషన్ టిక్కెట్టు కొనుగోలు చేసి ఎక్ష్ప్రెస్స్ బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చునని RM తెలిపారు.

 

For contributing, News/Articles mail us at [email protected] or call us at +91-833-18-18-833
Follow us on Facebook, Twitter, Instagram, Youtube /kakinada9

Advertisement

Share this content.