You are here

APSRTC Running Special Busses from Kakinada to Pancharama Kshetras

APSRTC Running Special Busses to Pancharama Kshetras

 

 

 

 

APSRTC-04091452.jpg

 

కార్తీక మాసం పురస్కరించుకొని పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కాకినాడ డి ఎం పీ భాస్కరరావు తెలిపారు. ఈ నెలలో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 8 గంటలకు డిపో నుంచి బయలుదేరి బస్సులు మరుసటి రోజు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట దర్శనానంతరం రాత్రి 10 గంటలకు కాకినాడ చేరుతాయి అన్నారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరి బస్సులు సామర్లకోట, ద్రాక్షారామ, పాలకొల్లు, భీమవరం, అమరావతి దర్శనానంతరం తిరిగి తెల్లవారుజామున 3 గంటలకు కాకినాడ చేరుతాయి అన్నారు. శ్రీశైలానికి రోజు సాయంత్రం 6:15, 7:10 గంటలకు ప్రత్యేక బస్సులను కార్తీకమాసంలో నడుపుతామన్నారు. ఇతర రోజుల్లో వెళ్లేందుకు ఎవరైనా బృందాలుగా వచ్చి సంప్రదిస్తే వారికి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.
ఎక్స్ప్రెస్ సర్వీస్ ఛార్జీలు పెద్దలకు రూ.675, పిల్లలకు రూ.530 గా నిర్ణయించినట్టు తెలిపారు. అల్ట్రా డీలక్సు బస్సు సర్వీస్ ఛార్జీలు పెద్దలకు రూ.830, పిల్లలకు రూ.650 గా నిర్ణయించామన్నారు, సూపర్ లగ్జరీ సర్వీస్ కు పెద్దలకు రూ.870, పిల్లలకు రూ.680 గా నిర్ణయించామన్నారు.

Advertisement

Share this content.