• జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి మల్లి బాబు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో లో యోగా శిబిరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్యాలయాల అధికారులు సిబ్బంది వ్యాయమోపాధ్యాయులు వివిధ పాఠశాల విద్యార్థులు యోగా నిర్వాహకులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆసక్తి ఉన్నవారు జిల్లా ప్రాధికార సంస్థ లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. హాజరయ్యేవారు వదులుగా ఉండే తెల్లటి దుస్తులు వేసుకుని రావాలన్నారు ఇతర వివరాలకు 9032934038 నంబర్లలో సంప్రదించాలన్నారు.