• ఐక్య ఉపాధ్యాయ సంఘం(యూటీఎఫ్‌) ఆధ్వర్యంలో జిల్లాలోని మూడు ప్రాంతాల్లో డిపార్టుమెంటల్‌ టెస్టులపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డీవీ రాఘవులు, టి.కామేశ్వరరావు తెలిపారు. అమలాపురంలోని ఎంప్లాయిస్‌ హోమ్‌, కాకినాడలోని యూటీఎఫ్‌ హోమ్‌, రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ పాఠశాలలో ఈ సదస్సులు జరుగుతాయన్నారు. సబ్జెక్టు నిపుణులు పాల్గొని పరీక్షలపై అవగాహన కల్పిస్తారన్నారు. పరీక్ష రాసే ఉపాధ్యాయ, ఉద్యోగులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఆయా ప్రాంతాల్లో సదస్సుకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉద్యోగులు అమలాపురం(99126 38501), కాకినాడ(94912 53274), రాజమహేంద్రరం(81434 82229) చరవాణి సంఖ్యలను సంప్రదించాలని కోరారు.