• మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేక్ తయారీపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ప్రముఖ చెఫ్ యం.కావ్య అన్నారు. స్థానిక అచ్యుతాపురం గేట్ సమీపంలోని ద్వారకానగర్ తన స్వగృహంలో కేక్ తయారీపై బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.ముఖ్యంగా మహిళలు ఖాళీ సమయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ సదస్సు శుక్రవారం వరకు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతీరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సు నిర్వహిస్తామన్నారు.