• జిల్లా బేస్ బాల్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21న సబ్ జూనియర్స్ విభాగంలో క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఇంచార్జ్ కార్యదర్శి రవి సుందర్ కౌర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల క్రీడామైదానంలో జిల్లా బేస్ బాల్ సంఘ అధ్యక్షుడు సాయిబాబా ఆధ్వర్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. 2004 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపికైన క్రీడాకారులు కర్నూలు జిల్లాలో 28 నుంచి 30వ తేదీ వరకు జరిగే అంతర్ జిల్లాల బేస్ బాల్ పోటీలలో జిల్లా తరపున పాల్గొంటారని బేస్ బాల్ సంఘం నిర్వహణా కార్యదర్శి పీడీ డాక్టర్ కె.స్పర్జనరాజు తెలిపారు. మరిన్ని వివరాలకు 9440950383 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.