You are here

గోదావరి నదిలో బోటు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సిఎం చంద్రబాబు || బాధిత కుటంబాలకు 10 లక్షలు

News Desk - Kakinada9:

గోదావరి నదిలో లాంచీ ప్రయాణం లో మరణించిన వారికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు తెలిపారు.

 

cm-visit-boat-accident-00.jpg

 

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం నుండి కొండ మొదలు గిరిజన గ్రామానికి వెళుతుండగా లాంచీ ప్రమాదం చాలా ఘోరమైనదన్నారు. నేడు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి వద్ద ప్రమాదం జరిగిన లాంఛీ నుండి మృతదేహాల వెలికితీత ఇతర సహాయక పునరావాస కార్యక్రమాలను పరిశీలిస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు ఆదేశాలు ఇచ్చారు.

 

 

cm-visit-boat-accident-01.jpg

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రమాదానికి గురైన లాంచీలో 44 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారని వారిలో 37 మంది తూర్పు గోదావరి జిల్లాకు, 7 మంది పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని 6 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని 4 గ్రామాలకు చెందిన ప్రయాణికులు 26 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నట్టు సమాచారం ఉందన్నారు.

 

cm-visit-boat-accident-02.jpg

 

అయితే వీరిలో 22 మంది సురక్షితంగా బయటపడ్డారని వారిలో 19 మంది చిరునామాలు తెలుసుకోగలిగామని అయితే మిగిలిన వారి ఆచూకి వివరాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. మరో 12 మంది మృతదేహాలు వెలికి తీశామని ఇంకా 10 మంది మృతదేహాలు వెలికి తీయాల్సి ఉందని అయితే వారిలో ముగ్గురు వివరాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈదురు గాలులు, వర్షం మూలంగా ఈ సంఘటన చోటుచేసుకుంది అన్నారు. ఉదయం ప్రయాణానికి సిద్ధమైన లాంచీని అధికారులు తనిఖీ చేశారని అప్పటి పరిస్థితి కండిషన్ లోనే ఉన్నట్లు నివేదిక ఉందన్నారు. అయితే సాయంత్రం పూట కొన్ని అపశ్రుతుల చోటు చేసుకున్నందున ఈ సంఘటనకు కొంత కారణమవుతుందని గుర్తించామన్నారు.

 

cm-visit-boat-accident-03.jpg

 

మరణించిన వారిని తిరిగి తీసుకురాలేముగాని మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షలు రూపాయలు ఎక్స్గ్రేషియా అందిస్తామని అందులో తక్షణం లక్ష రూపాయలు అంత్యక్రియలకు ఇతర అత్యవసర పనులకు విడుదల చేస్తున్నామని చెప్పారు.మృతుల కుటుంబాలకు ఇల్లు నిర్మిస్తామని చదువుకున్నవారికి స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గోదావరిలో లాంచీ మునక ఘోరమైన, బాధాకరమైన సంఘటన అని ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు.

 

cm-visit-boat-accident-04.jpg

 

ఇప్పటికే వారు పోలీసులకు లొంగిపోవడం జరిగిందన్నారు. లాంచీలో సిమెంటు బస్తాలతో పాటు మోటారు సైకిళ్ళు కూడా ఉంచారని ముఖ్యమంత్రి తెలిపారు. సంఘటన జరిగినట్లు తెలిసిన వెంటనే ఉభయ గోదావరి జిల్లాల యంత్రాగాన్ని సన్నద్ధం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సహాయ పునరావాస కార్యక్రమాల్లో NDRF రెండు ప్లాటూన్స్ 60 మంది, నావికి చెందిన నలుగురు రెండు ఎయిర్ఫోర్స్ హెలికాఫ్టర్లు గాలింపు చర్యలు, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నాయని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వివరించారు.

 

cm-visit-boat-accident-05.jpg

 

ఈ సహాయ పునరావాస కార్యక్రమంలో 126 మంది పాల్గొన్నారని నిన్న సాయంత్రం నుండి గాలింపు చేపట్టనప్పటికీ రాత్రి నుండి గాలింపు అనుకూలంగా లేకపోవటంతో బుధవారం ఉదయం నుండే అన్ని విధాలా ప్రయత్నం చేశామన్నారు. అదే విధంగా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. 

 

cm-visit-boat-accident-08.jpg

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు హోంశాఖామంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీ నక్కా ఆనందబాబు, రాజముండ్రి లోక్ సభ సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్, పోలవరం శాసన సభ్యులు శ్రీ మొడియం శ్రీనివాసరావు, రంపచోడవరం శాసన సభ్యులు శ్రీ పంతం రాజేశ్వరి పాల్గొన్నారు.

 

cm-visit-boat-accident-07.jpg

 

అలానే రాజమండ్రి శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కార్యదర్శి శ్రీ రావత్, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు డా.కాటంనేని భాస్కర్, శ్రీ కార్తికేయ మిశ్ర, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రవి ప్రకాష్, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ విశాల్ గున్ని, తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషద్ చైర్మన్ శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

 

© Kakinada9.com 2018. All Rights Reserved

Advertisement

Share this content.