You are here

మండలాల వారీగా 'బ్రాహ్మణ మిత్ర' పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

News Desk - Kakinada9:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బ్రాహ్మణుల స్థితిగతులు మెరుగుపరచే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ పేద బ్రాహ్మణ సంక్షేమ కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని ఈ పథకాలు ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందజేయాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో బ్రాహ్మణ మిత్ర అనే స్వచ్చంద సేవకులను నియమించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ భావిస్తోందని సిహెచ్ ప్రసాద్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. బ్రాహ్మణ మిత్రలు వారి మండలాల పరిధిలో ఉన్న అర్హులైన బ్రాహ్మణులకు కార్పొరేషన్ పథకాల పట్ల అవగాహన కలిగించి లబ్ధిదారులను గుర్తించి వారికి దరఖాస్తు చేసుకునే విషయంలో తగిన తోడ్పాటు సహకారాలు అందజేయవలసి ఉంటుందని తెలిపారు. కార్పొరేషన్ కు లబ్దిదారులకు అనుసంధానంగా వ్యవహరిస్తూ లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందజేయడానికి పారదర్శకంగా కృషి చేయవలసి ఉంటుందని తెలిపారు. ఆయా మండలాల భౌగోలిక నైసర్గిక స్వరూప స్వభావాల పట్ల అవగాహన, బ్రాహ్మణులు అర్చకులు పట్ల సేవా దృక్పథం ఆసక్తి కలిగి 30 నుండి 45 సంవత్సరాల మధ్య వయసున్న వారు మాత్రమే బ్రాహ్మణ మిత్రులుగా పనిచేయడానికి అర్హులని అందుకోసం కార్పొరేషన్ వెబ్ సైట్ www.andhrabrahmin.ap.gov.in ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంపికైన దరఖాస్తుదారులకు గౌరవ పారితోషికం ఇవ్వబడునని ఈనెల 25 లోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

© Kakinada9.com 2018. All Rights Reserved

Advertisement

Share this content.