• బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో చదివి, పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను సంయుక్త కలెక్టర్‌-2 సీహెచ్‌సత్తిబాబు బుధవారం సత్కరించారు. పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించిన వి.విజయకుమార్‌(ఐ.పోలవరం), ఎల్‌.నానాజీ(ములగపూడి), ఎన్‌.శ్రీను భీమవరపుకోట, బి.విష్ణుభరత్‌(డి.పోలవరం)లకు బుధవారం కలెక్టరేట్‌లో ఒక్కొక్కరికి రూ.2116 చొప్పున నగదు పురస్కారాలను బీసీ సంక్షేమ శాఖ ద్వారా అందజేశారు. హాస్టల్‌లో చదివి 10/10 సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ఉప సంచాలకుడు సీహెచ్‌ హరిప్రసాద్, ఏబీసీడబ్ల్యు పీఎల్‌ఎన్‌ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.