• Tags
  • సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బెస్ట్‌ ఎవైలబుల్‌ పథకం కింద కార్పొరేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలో డేస్కాలర్‌గా ప్రవేశానికి లాటరీ ద్వారా ఎంపికైన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు మంగళవారం పరిశీలిస్తామని ఆ శాఖ ఉప సంచాలకురాలు ఎం.ఎస్‌.శోభారాణి తెలిపారు. జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఎలక్ట్రానిక్‌ లాటరీ ద్వారా ఈనెల 7న అమరావతిలోనే ఎంపిక చేశారన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితా తమకు పంపినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు తమ దరఖాస్తులో నమోదు చేసిన చరవాణి సంఖ్య(సెల్‌ నెంబరు)కు సంక్షిప్త సమాచారం (మెసేజ్‌)ను పంపారని శోభారాణి తెలిపారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు అసలు ధ్రువీకరణలు(సర్టిఫికెట్లు), ఆన్‌లైన్‌ దరఖాస్తు, వాటి నకళ్లు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో కాకినాడలోని అంబేడ్కర్‌ భవన్‌కు ఉదయం 10 గంటల కల్లా హాజరు కావాలని ఆమె సూచించారు.