• కీర్తి ప్రతిష్ఠలు కావాలంటే ప్రేమ, శాంతి, ఓర్పు, సహనాలను ఆభరణాలు ధరించాలని ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ రిజర్వు పోలీసులైన్‌ ఆవరణలోని అయ్యప్పస్వామి ఆలయంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు వేంకటేశ్వరస్వామి వైభవం పేరిట ప్రవచనాలు సాగుతాయని చాగంటి తెలిపారు. వేంకటేశ్వరస్వామి కల్యాణ వైౖభోగానికి ముందు జరిగిన ఘట్టాలను వివరించారు. ఈ నెల 25 వరకు వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు వైభవంగా జరగనున్నాయని, తిరుపతితో స్వామివారి కల్యాణం ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ అలాగే భక్తిశ్రద్ధలతో కల్యాణ మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్కలంక రామకృష్ణ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.