You are here

Chandrababu Naidu Participated in Janmabhoomi at Kakinada and Inaugurated development works

Chandrababu Naidu Participated in Janmabhoomi at Kakinada and Inaugurated development works

 

 

 

 

 

 

 

కాకినాడ జేఎన్టీయూ మైదానంలో చేసిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముందుగా జిఎంఆర్ పోర్ట్ కు, ఏపీ జి డి సి గ్యాస్ పైప్ లైన్లు, ఏ డి బి రహదారికి, స్మార్ట్ సిటీ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే ఏలేరు ఇరిగేషన్ సిస్టం మోడరనైజెషన్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు కాకినాడ సెజ్ లో రిఫైనరీ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ కోసం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హల్దియా కెమికల్ లిమిటెడ్ మధ్యన జరిగిన అవగాహన ఒప్పందం లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దేశంలోనే కాకినాడ నాలుగు ప్రధాన అత్యుత్తమ నగరాలలో ఒకటిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

 

కాకినాడ జేఎన్టీయూ క్రీడా మైదానంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత తెలుగు తల్లి ప్రార్థన, జ్యోతి ప్రజ్వలన అనంతరం ముఖ్యమంత్రి వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల తో ముఖాముఖి ముచ్చటించారు. లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి వారందరికీ అభినందనలు తెలియజేశారు.

 

 

అనంతరం ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ విభజన తో ఎదురైన ఎన్నో సమస్యలను అధిగమించి పట్టుదలతో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించుకునేందుకు జన్మభూమి మా ఊరు కార్యక్రమాలను జరుపుకుంటున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజా సంతృప్తిని, హర్షాన్ని అందుకోవడంలో కాకినాడ నగరం, తూర్పుగోదావరి జిల్లాలు రాష్ట్రంలో ముందున్నాయని ఆర్.టి.జి.ఎస్ గణాంకాలతో సహా ముఖ్యమంత్రి వివరించారు.

 

300 కోట్ల నిధులతో చేపట్టిన రాజానగరం - సామర్లకోట ఎడిబి రోడ్డు విస్తరణతో పోర్ట్ కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. 2,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎస్ ఈ జెడ్ 60 వేల కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న హల్దియా పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏపీ జిడిపి ద్వారా వెయ్యి కోట్ల నిధులతో చేపట్టిన కాకినాడ శ్రీకాకుళం నాచురల్ గ్యాస్ పైప్ లైన్ వ్యవస్థలు జిల్లాను అభివృద్ధి పదంలో పరుగులు తీయించనున్నాయి అన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులకు స్కాలర్షిప్ల చెల్లింపుకు 105 కోట్ల రూపాయల మెగా చెక్కును ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు అందజేశారు. 13.29 కోట్ల సంక్షేమ లో ఆస్తులు ముఖ్యమంత్రి పంపిణీ చేశారు.

 

 

ఆధునిక వసతులతో కూడిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు 10 కోట్ల 65 లక్షలతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్ని వసతులు కల్పించడం జరిగింది. మొదటి అంతస్తులో ఆడిట్ సెక్షన్, సెంట్రల్ రికార్డ్ రూమ్ తదితర 13 వసతులు ఉన్నాయి. రెండవ అంతస్తులో కంట్రోల్ రూమ్ విభాగం, స్పెషల్ బ్రాంచ్ సెక్షన్, కంప్యూటర్ విభాగాలు, ఓ ఎస్ డి విభాగం తదితర పది విభాగాలు ఉన్నాయి. మూడవ అంతస్తులో కమాండ్ కంట్రోల్ రూమ్, ఎస్పీ ఛాంబర్, అదనపు ఎస్పీ విభాగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇతర వసతులు కూడా జిల్లా పోలీసు కార్యాలయంలో అధునాతనంగా కల్పించడం జరిగింది. తొలుత ముఖ్యమంత్రి ప్రారంభోత్సవ శిలాఫలకం ఆవిష్కరించి మొదటి అంతస్తులో వివిధ విభాగాలను ఆయన సందర్శించారు.

Advertisement

Share this content.