• జిల్లా చైల్డ్ వెల్పేర్ కమిటీ ఆమోదం మేరకు కాకినాడ శిశుగృహ
  సంరక్షణలో ఉన్న రెండున్నరేళ్ల బాలిక బేబి బ్లెస్సి ని చెన్నైకు చెందిన
  వి.సంపత్ కుమార్, అనూష దంపతలు చట్టబద్ద దత్తత స్వీకరించారు. సదరు
  బాలికను సోమవారం రాత్రి కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్
  డి.మురళీధరరెడ్డి వారికి అందజేసి అభినందనలు తెలియజేశారు. 2018 నవంబరు 8వ
  తేదీన జగ్గంపేట జాతీయ రహదారిలో రాత్రి 9 గంటల సమయంలో 2 సంవత్సరాల
  ఆడబిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు వదలి వెళ్లగా, కాట్రావులపల్లి

  గ్రామనికి చెందిన కొరుప్రోలు శ్రీను, దుర్గ దంపతులు పెంచుకునేందుకు తమ
  ఇంటికి తీసుకు వెళ్లారని ఐసిడిఎస్ పిడి సుఖజీవనబాబు తెలిపారు. జిల్లా బాలల
  సంక్షేమ సమితి ఈ బిడ్డను వారి నుండి తీసుకుని చట్టబద్దమైన దత్తత
  నిమిత్తం ఐసిడిఎస్ ఆధ్వర్యం నిర్వహిస్తున్న కాకినాడ శిశుగృహకు
  తరలించారని, ఆమెకు బ్లెస్సీ గా నామకరణం చేసి ఆశ్రయం కల్పించామన్నారు.
  అనంతరం దత్తతా చట్టం ప్రకారం అన్ని అర్హతలతో ధరఖాస్తు చేసుకున్న
  చైన్నైకు చెందిన వి.సంపత్ కుమార్, అనూష దంపతులకు బాలిక బ్లెస్సీని దత్తత
  ఇస్తూ చైల్డ్ వెల్పేర్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
  ఈ సందర్భంగా బాలిక బ్లెస్సీని దత్తత స్వీకరించడం తమకు ఎంతో
  ఆనందం కలిగించినదని, ఆమెకు సౌమ్యగా నామకరణం చేసి మురిపెంగా పెంచి మంచి
  భవిష్యత్తు అందిస్తామని సంవత్ కుమార్, అనూష దంపతులు ఈ సందర్భంగా
  తెలిపారు.
  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్.సత్తిబాబు, డిఆర్ఓ
  యం.వి.గోవిందరాజులు, ఐసిడిఎస్ ఎపిడి పి.మణెమ్మ, శిశుగృహ మేనేజరు ప్రమీణ
  తదితరులు పాల్గొన్నారు.