• State Chief Minister YS Jagan Mohan Reddy said all measures should be taken to provide relief to flood victims. The Chief Minister said that steps should be taken to provide 5000 rupees and 25 kg of rice to the houses damaged by the floods. He said that the farmers should be provided with compensation as per the norms.  farmers should also be provided with seeds free of charge.  The Minister of Health, Anil Kumar Yadav, Minister of Water Supply and Drainage. Legislators  Satyanarayana East Collector D. Muralidhar Reddy, West Godavari Collector R. Muthiyala Raju, Joint Collectors Laxmi Shah, Venugopal Reddy, Municipal Commissioner Sumit Kumar Gandhi, ITDA Collector V. Mahesh Kumar, Airport Director M. Raj Kishore and others were present.

    వరద బాధితులను అన్ని విధాలా అడుకుంటాము.ముఖ్యమంత్రి-జగన్.               .             .         .రాజమహేంద్రవరం,ఆగస్టు-08:వరద బాధితులను అన్నివిధాల ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు.గురువారం ముఖ్యమంత్రి వరద ప్రాంతాలలో ఎలికాఫ్టర్ ద్వారా పరిశీలించిన అనంతరం రాజమహేంద్రవరం విమానాశ్రయంనకు విచ్చేశారు.విమానాశ్రయం డైరెక్టర్ కార్యలయం కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిలు,మంత్రులు,శాసనసభ్యుల తో వరద పై సమీక్షించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరదల వల్ల దెబ్బతిన్న ఇండ్లకు 5 వేలు రూపాయలు,25 కేజీల బియ్యం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.పంట నష్టపోయిన రైతులకు నిబంధనల మేరకు పరిహారం చెల్లింపుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు.నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు కూడా అందించే విధంగా చూడాలని అన్నారు.కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి.సుబోసు చంద్ర బోస్,ఉపముఖ్యమంత్రి ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల.నాని,జలవనరు శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్,హౌసింగ్ శాఖమంత్రి చేరువాడ.శ్రీ రంగనాథ రాజు,రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి.రాజా,కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి.చంద్ర శేఖర్ రెడ్డి,రంపచోడవరం శాసనసభ్యులు ఆవులపల్లి.ధనలక్ష్మి,తనుకు శాసనసభ్యులు కారుమూరి.నాగేశ్వరరావు,పోలవరం శాసనసభ్యులు తెల్లం.బాలరాజు,తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు.సత్యనారాయణ తూర్పు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి,పశ్చిమగోదావరి కలెక్టర్ ఆర్.ముత్యాల రాజు,జాయింట్ కలెక్టర్లు లక్ష్మీ శ,వేణుగోపాల్ రెడ్డి,మునిసిపల్ కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ,ఐ.టి.డి.ఏ-పి.ఓ-నిశాంత్ కుమార్,సబ్-కలెక్టర్ వి.మహేష్ కుమార్,ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎమ్.రాజ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.