You are here

Collector and Kakinada City MLA Inspeted Vivekanandha and Gandhi Parks

Collector Kartikeya Mishra and Kakinada City MLA Vanamaadi Venkateswararo Inspeted Vivekanandha and Gandhi Parks

 

 

 

 

 

 

కలెక్టర్ కార్తికేయ మిశ్రా, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర రావుతో కలిసి నేడు సాయంత్రం కాకినాడలో వివేకానంద పార్క్, గాంధీ పార్క్ లను తనిఖీ చేశారు. వివేకానంద పార్క్ లో లైటింగ్ మెరుగు పరిచే చర్యలు చేపట్టాలని కొన్ని ప్రాంతాల్లో లైట్లు లేవని వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా గాంధీ పార్క్ లో కొన్ని ప్రదేశాలలో ఉన్న పాత సామాగ్రిని తొలగించి ఆ ప్రాంతం శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా పార్కుల నిర్వహణపై ప్రజల నుండి అభిప్రాయాన్ని కూడా కలెక్టర్ సేకరించారు. పార్కులో సౌకర్యాలు బాగున్నాయని పార్కు ఆధునీకరణ తరువాత కొత్త సదుపాయాలతో ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని పలువురు తమ అభిప్రాయాలను కలెక్టర్కు తెలియజేశారు. కలెక్టర్ వెంట కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె. రమేష్ , మున్సిపల్ సిబ్బంది , పార్క్ కాంట్రాక్టర్లు ఉన్నారు.

Advertisement

Share this content.