• రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖా మంత్రి గా పదవీ బాధ్యతలు స్వీకరించి జిల్లా పర్యటనకు విచ్చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జాయింట్ కలక్టర్ ఎ.మల్లిఖార్జున, వివిధ శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

    మంగళవారంనాడు మంత్రి స్వగ్రామమైన రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను కలుసుకుని అభినందనలు తెలియజేశారు. కాకినాడ యం.పి. శ్రీమతి వంగా గీత, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పుష్పగుచ్చం అందేజేసి అభినందనలు తెలిపారు.

    జాయింట్ కలక్టర్-2 సిహెచ్.సత్తిబాబు, డి.ఆర్.ఓ. యం.వి.గోవిందరాజులు, రామచంద్రపురం ఆర్.డి.ఓ., ఎన్.రాజశేఖర్, సమాచార శాఖ ఉపసంచాలకులు యం.ఫ్రాన్సిస్, ఎన్.జి.ఓ. నాయకులు బూరిగ ఆశీర్వాదం తదితరులు మంత్రి బోస్ కు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అదే విధంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి బోసుకు అభినందనలు తెలిపారు.