• వర్షాకాలంలో తరచుగా ఎదురౌయ్యే మలేరియా, డయేరియా,
  డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధుల నివారణ లక్ష్యంగా అన్ని పట్టన,
  గ్రామీణ ఆవాసాల్లో ముమ్మర పారిశుద్య, ఆరోగ్యవిద్యా

  కార్యక్రమాలు, దోమల నిర్మూలన చర్యలు చేపట్టాలని జిల్లా
  కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధికారులను ఆదేశించారు.
  సోమవారం మద్యాహ్నం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి
  జిల్లా, డివిజనల్, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి
  సీజనల్ వ్యాధుల నివారణ, వివిధ అభివృద్ది ప్రోజెక్ట్ పనుల పురోగతి,
  సంక్షేమ కార్పొరేషన్ లబ్దిదారులకు రుణాల గ్రౌండింగ్,
  పట్టన,గ్రామీణ గృహనిర్మాణాలు, ఉపాధి హామీ, కన్వర్జెన్స్ పనులు,
  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహక చర్యలు, రెవెన్యూ
  అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. తొలుత
  అభివృద్ది ప్రోజెక్ట్ల సమీక్షలో అన్ని పనులను నిర్థిష్ట
  గడువులోపు పూర్తి చేసేందుకు ఆయా శాఖలు టైమ్ లైన్ ప్రకారం
  చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎడిబి రోడ్డు విస్తరణ కొరకు
  సేకరించిన భూములకు చెల్లింపులు సత్వరం పూర్తి చేసి పనులు
  నిర్వహించేందుకు భూమిని ఆర్.డి.సి.కి అప్పగించాలని పెద్దాపురం
  ఆర్డిఓ, రాజమండ్రి సబ్ కలెక్టర్లను కోరారు. కాకినాడలోని
  కొండయ్యపాలెం, బిక్కవోలు ఆర్ఓబిల కొరకు భూమి సేకరించి
  అప్పగించినా పనులు జాప్యం కావడానికి కారణాలను ఆయన ఆర్ అండ్ బి
  అధికారులతో సమీక్షించారు. అలాగే జిల్లాలో వివిధ చోట్ల
  ప్రతిపాదించిన ఫ్లైఒవర్ నిర్మాణానికి క్రాంట్రాక్ ఏజెన్సీ
  నియామకం సత్వరం పూర్తిచేసి పనులు ప్రారంభించాలని ఎన్ హెచ్
  అధికారులకు సూచించారు. భారత్ మాల బీచ్ రోడ్ భూసేకరణలో ఎదురైన
  కోర్ట్ కేసులపై స్టే తొలగింపుకు, ఏటిమొగ హైలెవెల్ బ్రిడ్జి
  భూసేకరణకు చర్యలు ముమ్మరం చేయాలని ఆర్డిఓలను కోరారు.
  కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ సర్వే, భూసేకరణ
  కార్యక్రమాలను రైల్వే డిఈ, అమలాపురం ఆర్డిఓలు సమన్వయంతో
  వేగవంతం చేయాలన్నారు. సంక్షేమ కార్పొరేషన్ల
  రుణాల గ్రౌండింగ్ సమీక్షలో సబ్సిడీ విడుదల చేసిన లబ్దిదారులకు 10
  రోజుల్లోపు ఆయా బ్యాంకులు రుణం జారీచేయాలని, లేని పక్షంలో
  ప్రభుత్వవాటా సొమ్మను నిరర్థకంగా ఉంచినందుకు పెనాలిటీ
  విధిస్తామని బ్యాంకర్లకు తెలిపారు. యండిఓలు, మున్సిపల్ కమీషనర్లు
  ప్రతి మంగళ, శుక్రవారాల్లో సబ్సిడీ జారీచేసిన లబ్దిదాలులను
  సంబంధిత బ్యాంకులలో హాజరయ్యేట్లు ప్రత్యేక డ్రైవ్
  చేపట్టాలని, వారికి బ్యాంకులు సత్వరం రుణం విడుదల చేయాలని
  సూచించారు. కార్పొరేషన్లు విడుదల చేసిన సబ్సిడీ సి.ఎఫ్.ఎం.ఎస్
  సమస్యల వల్ల కొన్నిసార్లు లబ్దిదాల ఖాతాలలో జమ కావడంలేదని
  సమీక్షలో గమనించి రాష్ట్ర స్థాయిలో చర్చించి పరిష్కరిస్తామని
  తెలిపారు. గృహనిర్మాణ సమీక్షలో పూర్తయిన పట్టన, గ్రామీణ
  కాలనీలలో పౌర సదుపాయాల అభివృద్ది చేయాలని కోరారు.
  ఉపాధి హామీ పధకం పనుల సమీక్షలో అధిక వేతన, మెటీరియల్
  కాంపోనెంట్ సాధనకు అన్ని మండలాల్లో కూలీల హాజరు ప్రస్తుత రోజకు
  2.14 లక్షల స్థాయిని, 2.50 లక్షల స్థాయికి పెంచాలని ఆదేశించారు.
  కన్వర్జెన్సి ప్రణాళికల క్రింద ఈ సంవత్సరం జిల్లాల గ్రానైట్,
  బిటి రోడ్లు, ఆహారధాన్య గిడ్డంగులు, పంచాయితీ భవానాల నిర్మాణ
  పనులను ఉపాధి హామీ పధకం క్రింద ప్రాధాన్యతగా చేపట్టాలని
  సూచించారు. స్వచ్ఛభారత్ ఎల్ ఓ బి కార్యక్రమం క్రింద నిర్మించి
  మరుగుదొడ్ల జియోటాగింగ్ ఈ నెలాఖలు లోపు తప్పని సరిగా పూర్తి
  చేయాలని ఆదేశించారు.

  సీజనల్ వ్యాధుల నివారణ కార్యాచరణ సమీక్షలో జిల్లాలో
  డెంగూ, మలేరియా, డయేరియా వ్యాధి ఉనికి తరచుగా ఎదురౌతున్న
  బ్లాక్ స్పాట్ ఆవాసాలలో వర్షాలు ప్రారంభానికి ముందే ముమ్మర
  శానిటేషన్ డ్రైవ్ లు చేపట్టాలని పంచాయితీ, మున్సిపల్ అధికారులకు,
  వ్యాధుల నివారణపై ప్రజలకు ఆరోగ్య విద్య కార్యక్రమాల
  నిర్వహణకు వైద్యఆరోగ్య అధికారులను ఆదేశించారు. పట్టణ
  ఆవాసాలు, మేజర్ పంచాయతీలు, బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో ప్రతి
  రోజు ఉదయం ఒక గంట ముమ్మర శానిటేషన్ కార్యక్రమాలను
  నిర్వహించాలని ఆదేశించారు. కాకినాడ నగరంలో నిర్వహించే ఈ
  కార్యక్రమాలలో తాను స్వయంగా పాల్గొంటానని, ఆర్డిఓలు, జిల్లా,
  మున్సిపల్ అధికారులు ఆయా ఆవాసాల్లో పాల్గొని పారిశుద్యం,
  ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రజలను చైతన్య పరచాలని కోరారు.
  జిల్లాలో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నాహక
  చర్యలను సమీక్షిస్తూ, పంచాయితీలలో గుర్తించిన ఎస్సి, ఎస్టి, బిసి
  ఓటర్ల జాబితాలపై అందిన అభ్యంతరాలను 11వ తేదీ నుండి 17వ తేదీ వరకూ
  గ్రామసభలు నిర్వహించి పరిష్కరించాలని, 18వ తేదీన తుది జాబితా
  క్రోడీకరించి, జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని, 20వ తేదీన తుది
  జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. అలాగే అర్బన్ స్థానిక
  సంస్ధలు (కాకినాడ మినహా)లలో కూడా ఎస్సి, ఎస్టి,బిసి ఓటర్లతో
  జాబితాలను ప్రకటనకు సిద్దం చేయాలని మున్సిపల్ కమీషనర్లు
  ఆదేశిచారు.
  రెవెన్యూ అధికారులతో సమీక్షలో 22ఏ భూముల జాబితాలు,
  అలైనేషన్ భూముల వివరాల జాబితాల అప్ డేషన్, అడంగళ్ సవరణలు,
  ముటేషన్లు తదితర కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని
  తహసిల్దారు, ఆర్డిఓలు, సబ్ కలెక్టర్లను కోరారు. శాఖల తుఫాను
  సహాయ ప్రణాళికలు రూపకల్పన, సహాయక బృందాల ఏర్పాటు, తుఫాను
  షెల్టర్ల రిపేర్లు అంశాలపై మండలాల వారీగా సమాయత్తం కావాలని
  సూచించారు. మీ కోసం కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను జాప్యం
  లేకుండా పరిష్కరించాలని కోరారు.
  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 సిహెచ్ సత్తిబాబు, డి ఎఫ్
  ఓ నందని సలారియా, అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిభారాణి, డిఆర్ఓ
  యం.వి.గోవిందరాజులు, డ్వామాపిడి వెంకటరమణ, జడ్ పి సిఈఓ
  విద్యాసాగర్, మున్సిపల్ పరిపాలన ఆర్డి నాగరాజారావు, కాకినాడ
  మున్సిపల్ కమీషనర్ కె.రమేష్, హౌసింగ్ పిడి పి.వీరేశ్వరప్రసాద్,
  టిడ్కో పిడి శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఎస్ఈ విజయకుమార్,
  పంచాయితీ రాజ్ ఎస్ఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.