You are here

Collector & Mayor Participated in Dewarming Day Programme at Kakinada

Collector & Mayor Participated in Deworming Day Programme at Kakinada

 

 

 

 

 

 

ముందస్తు జాగ్రత్తలతోనే ఫైలేరియా నివారణ సాధ్యమని కలెక్టర్‌ కార్తికేయమిశ్రా పేర్కొన్నారు. జాతీయ ఫైలేరియా నివారణ దినం  సందర్భంగా కాకినాడలోని రేచర్లపేట ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం డీఈసీ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 10 జిల్లాల్లో బోద వ్యాధి లక్షణాలున్నాయన్నారు. అందులో మన జిల్లా కూడా ఉందన్నారు. బోద వ్యాధి నివారణకు 2014లో మాస్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ను చేపట్టామన్నారు. 2017లో ట్రాన్స్‌మిషన్‌ అసెస్‌మెంట్‌ సర్వే ప్రకారం జిల్లాలో మరో విడత మాస్‌ డ్రగ్‌ అసెస్‌మెంట్‌ను చేపట్టాలని నిర్ణయించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ వ్యాధి నివారణ కోసం డీఈసీ మాత్రలతో పాటు ఆల్‌బెండజోల్‌ మాత్రలను కూడా పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ వివరించారు. డీఈసీ మాత్రలు సూక్ష్మ ఫైలేరియాను నశింపచేస్తాయన్నారు. ఆల్‌బెండాజోల్‌ పేగులో ఉన్న క్రిములను నశింపచేస్తాయన్నారు. కాకినాడ నగర మేయర్‌ సుంకర పావని మాట్లాడుతూ ఫైలేరియా నివారణకు వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. డీఎంహెచ్‌వో టీఎస్‌ఆర్‌ మూర్తి మాట్లాడుతూ జిల్లాను ఫైలేరియా రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సహకరిచాలని కోరారు. జేసీ-2 సీహెచ్‌ సత్తిబాబు, డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌కిషోర్‌, డీఐవో డాక్టర్‌ మల్లిక్‌, అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పవన్‌కుమార్‌, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌, తదిరతులు పాల్గొన్నారు.

Advertisement

Share this content.