You are here

Collector ordered to Extend Free Entry into NTR Beach Front Arcade Kakinada

Collector ordered to Extend Free Entry into NTR Beach Front Arcade Kakinada.

 

 

 

 

 

 

 

 

 

ఈ నెల 5వ తేదీ నుండి కాకినాడ బీచ్ ఫ్రంట్ ఆర్కేడ్ ను సందర్శించే సందర్శకుల నుండి వసూలు చేపడుతున్న ప్రవేశ రుసుము, పార్కింగ్ రుసుము గ్లాస్ బ్రిడ్జ్ సందర్శన రుసుము మరియు ఇతర రుసుములు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు నిలుపుదల చేయడమైనదని డిప్యూటీ తహసీల్దార్ వారు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 5 నుంచి  బీచ్ ఫ్రంట్ ఆర్కేడ్ నందు సందర్శకుల నుండి బీచ్ ఫ్రంట్ కు పెద్దలకు 30 రూ, పిల్లలకు 10 రూ. అలానే గ్లాస్ బ్రిడ్జ్ కు గాను పెద్దలకు 20 రూ, పిల్లలకు 10 రూ. అలానే లేసర్ షో కు పెద్దలకు 20 రూ, పిల్లలకు 10 రూ. అదే విధంగా పార్కింగ్ కు గాను ఫోర్ వీలర్ కు 20 రూ. టు వీలర్ కు 10 రూ. వసూలు చేసేవారు. అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రజలు ఇకపై బీచ్ ఫ్రంట్ ఆర్కేడ్ ను పూర్తిగా ఉచితంగా సందర్శించవచ్చు. అయితే ఈ ఉచిత ప్రవేశం కేవలం కొద్ది రోజులు మాత్రమే అమలులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సంక్రాంతి సెలవుల సందర్భంగా బీచ్ ఫ్రంట్ ఆర్కేడ్ ను సందర్శించే ప్రజలకు ఇది మంచి వార్తే అని చెప్పాలి.

Advertisement

Share this content.