You are here

Collector Review Meeting with Officers

Collector Review Meeting with Officers

 

 

 

DSC_6171-01.jpg

 

 

రబీలో విత్తనాలు వెదజల్లే సాగు విధానాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సూచించారు.  వ్యవసాయం, అనుంబంధ రంగాలు, వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్షలు నిర్వహించారు. డిసెంబరు నుంచి రబీ ప్రారంభం కానుందని, 2019 మార్చి 31వ తేదీలోగా దీన్ని పూర్తి చేయాలని సూచించారు. ఏప్రిల్‌ 1 నుంచి గోదావరి కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించటానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు. రబీలో వరితో పాటు జొన్నలు, మొక్కజొన్నలు, అపరాలు, నువ్వులు, శనగలు తదితర పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. అనంతరం మత్స్యశాఖ, పశుసంవర్థకం, ఉద్యానం, మార్కెటింగ్‌ శాఖల ప్రగతిని సమీక్షించారు. చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
దోమల నివారణకు చర్యలు 
జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. వీధిదీపాల విషయలో నిర్లక్ష్యం వద్దన్నారు. కుక్కలు, పందులు నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించాలన్నారు. పోస్టర్‌ ఫ్రీ ఉద్యమాన్ని నిర్వహించాలని సూచించారు.

స్వశక్తి సంఘాలను బలోపేతం చేయాలి 
జిల్లాలో సి, డి గ్రేడుల్లో ఉన్న మహిళా స్వశక్తి సంఘాలను పటిష్టం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వెనకబడిన సంఘాలను ఎ, బి గ్రేడుల్లోకి తేవాలన్నారు. ఈ సంఘాలకు నిర్ధేశించిన బ్యాంకు లింకేజీని త్వరగా అమలు చేయాలన్నారు. చంద్రన్న బీమా పథకం అమల్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.

Advertisement

Share this content.