• భారత్ మాల పధకం క్రింద కాకినాడ పోర్ట్ నుండి అన్నవరం వరకూ పారిశ్రామిక అభివృద్ది అవసరాలు, జాతీయ రహదారితో పోర్ట్ అనుసంధానం కొరకు ప్రతిపాదించిన బీచ్ రోడ్ ప్రోజెక్ట్ కొరకు సర్వే, అలైన్మెంట్ ప్రక్రియలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఎన్ హెచ్ అధికారులను కోరారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో భారత్ మాల బీచ్ రోడ్ ప్రోజెక్ట్ పై జాతీయ రహదారుల అధారిటీ అధికారులు, కన్సల్టెంట్లతో జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి ప్రత్యక సమావేశం నిర్వహించారు. సమావేశంలో కాకినాడ పోర్ట్ ను, కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్ ప్రాంత సత్వరాభివృద్ది లక్ష్యంగా కాకినాడ పోర్ట్ నుండి అన్నవరం వద్ద ఎన్ హెచ్-16ను కలుపుతూ సుమారు వెయ్యి కోట్ల అంచనా వ్యయంతో భారతమాల బీచ్ రోడ్ రహదారి ప్రోజెక్ట్ ను ప్రతిపాదించడం జరిగిందని ఎన్ హెచ్ ప్రోజెక్ట్స డైరక్టర్ శ్రీనివాసరావు ఆయనకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సుమారు 40 కిమీ నిడివితో టెక్నికల్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదిత రోడ్ ప్రోజెక్ట్ రిపోర్ట్ ను సిద్దం చేసిందని, రోడ్ అభివృద్దికి 860 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో 719 ఎకరాల మేరకు సర్వే ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. అయితే 5 ప్రదేశాలలో 13.5 కిమీ రోడ్ స్ట్రెచ్ అలైన్ మెంట్ కు సంబంధించి ప్రజల నుండి అభ్యంతరాలు, వ్యతిరేకత ఎదరౌతోందని, కొంత మంది ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. ఈ కారణంగా భూ సేకరణ ప్రక్రియ జాప్యం కలుగుతోందని వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపాదిత రోడ్ ప్రోజెక్ట్ లో భూసేరణకు అవుతున్న వ్యయాన్ని, జనావాసాలపై ప్రభావాన్ని తగ్గించే రీతిలో ప్రోజెక్ట్ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను కూడా సిద్దం చేయాలని సిద్దం చేయాలని, ప్రభుత్వం ఆమోదం తెలిపిన ప్రణాళిక కనుగుణంగా భూసేకర చేపడతామని ఎన్ హెచ్ అధికారులకు తెలియజేశారు.

    ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 సిహెచ్ సత్తిబాబు, ఎన్ హెచ్ ఎ ఐ అధికారులు మాధవన్, రోహిత్, కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.