• Tags
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. సదరు ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా కాకినాడ నగర పాలక సంస్థ 10/ 10 జి పి ఏ సాధించుటలో రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచింది. 2018-19 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 2019 లో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ఈ ఫలితాలను కాకినాడ నగర పాలక సంస్థ విద్యార్థిని విద్యార్థులు సాధించారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 14 ఉన్నత పాఠశాలలకు సంబంధించి 1307 మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందు 1246 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఉన్నారు. ఈ ఉత్తీర్ణత శాతం 95.3% గా ఉండి ఉన్నది. కాకినాడ నగర పాలక సంస్థ నుండి 570 మంది విద్యార్థులు 737 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరు అయ్యి ఉన్నారు. అందు 546 మంది బాలురు 700 మంది బాలికలు ఉత్తీర్ణులైనారు. ఇందులో 10/ 10 gpa సాధించిన విద్యార్థిని విద్యార్థులు 39 మంది ఉన్నారు. ప్రస్తుతo కాకినాడ నగరపాలక సంస్థ రాష్ట్ర పదవ తరగతి ఫలితాల లో 39 మంది విద్యార్థులు 10/ 10 gpa సాధించి ప్రథమ స్థానంలో ఉండి ఉన్నారు. అదేవిధంగా రెండవ స్థానం 21 మంది 10/ 10 gpa సాధించి గుంటూరు వారు కైవసం చేసుకున్నారు. మూడవ స్థానం గా 19 మంది విద్యార్థులతో విశాఖపట్టణం వారు నిలిచారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డి.ఎం.ఎ. వారి ఆదేశాలను అనుసరించి నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని ఉన్నత పాఠశాలల నుండి మెరుగైన విద్యార్థులను అందరినీ ఒక చోటకు చేర్చి అడ్వాన్స్డ్ ఫౌండేషన్ స్కూల్ అనే దాని ద్వారా విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించడం జరిగింది. తద్వారా సదరు ఫలితాలను విద్యార్ధులు సాధించినారు. అడ్వాన్స్డ్ ఫౌండేషన్ స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు 31 మంది ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా అందు నుండి 18 మంది విద్యార్థిని విద్యార్థులు 10/ 10 gpa , 8 మంది 9.8 జీపీఏ సాదించుట జరిగినది. ఈ ఫలితాలు కాకినాడ నగర పాలక సంస్థకు ఒక మైలు రాయి గా నిలుస్తాయని, అదేవిధంగా కాకినాడ నగర పాలక సంస్థకు సంబంధించి పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థినీ విద్యార్థులలో 9.8 gpa సాధించిన వారు 34మంది, 9.7 జి పి ఎ సాధించినవారు 27 మంది, 9.5 జీపీఏ సాధించిన వారు 29 మంది 9.3 జీపీఏ సాధించిన వారు 42 మంది 9.2 జీపీఏ సాధించిన వారు 55మంది 9 జీపీఏ సాధించిన వారు 62 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. ఈరోజు సాధించిన ఈ ఫలితాల ద్వారా కాకినాడ నగర పాలక సంస్థ విద్యాశాఖ మరియు ఈ విద్యా విధానం ద్వారా సత్వర ఫలితాలు మంచి ఫలితాలను సాధించడం జరిగిందని, ఈ విధంగా కృషి చేయడానికి డి.ఎం..ఎ వారి యొక్క ఆదేశాలను పాటిస్తూ విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో, విద్యార్థులందరికీ కూడా అల్పాహారం ఎప్పటికప్పుడు అందజేస్తూ ఈ ఫలితాలను సాధించే దిశగా ఈ ప్రయాణం సాగిందని, ఈ ఫలితాలు సాధించుటలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులని పేరు పేరున ప్రత్యేకంగా కమిషనర్ కాకినాడ నగరపాలక సంస్థ శ్రీ కె రమేష్ గారు ప్రతి ఒక్కరిని అభినందించారు. అదే విధం గా ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పేరు పేరునా అభినందనలు తెలియజేస్తూ, కాకినాడ నగరపాలక సంస్థ యొక్క పేరును రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా మారు మ్రోగేలాగ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా అభినందనలు తెలియజేసినారు. భవిష్యత్తులో కాకినాడ నగరపాలక సంస్థ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులు మరిన్ని మంచి మెరుగైన ఫలితాలు సాధించడానికి ఈ ఫలితాలు దోహదపడతాయని ప్రతి ఒక్క విద్యార్థికి కాకినాడ నగర పాలక సంస్థ పాఠశాలల్లో అత్యంత సౌకర్యవంతమైన విద్యను అందించటం జరుగుతుందని నగరంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కాకినాడ నగరపాలక సంస్థ పాఠశాల యందు వారి యొక్క పిల్లలను జాయిన్ చేయవలసిందిగానూ, మరియు వారి యొక్క బంగారు భవిష్యత్తుకు నగరపాలక సంస్థ పాఠశాలలల ద్వారా బాటలు వేసుకో వలసిందిగా తద్వారా వారి యొక్క భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ కాకినాడ నగరపాలక సంస్థ వారు ప్రత్యేకంగా ఈ రోజు ఫలితాలను ఉద్దేశించి తెలియజేసినారు. ఫలితాలు సాధించిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులును మనస్ఫూర్తిగా అభినందించారు. ఇప్పటికే చాలా నగరపాలక సంస్థల పాఠశాలల్లో అడ్మిషన్లు పూర్తి కాబడినవి. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీ సి.హెచ్ నాగ నరసింహారావు గారు ఈ ఫలితాలు సాధించుటలో విశిష్ట కృషి చేసిన ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందర్నీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు కమిషనర్ వారి ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమమునకు మేనేజరు డి.వి.ఎస్.ఎన్.మూర్తి, పాఠశాలల పర్యవేక్షకులు ఎ.ఎఫ్ సి స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని, విద్యార్థులు, హాజరైనారు.