You are here

Commissioner KMC Received a Excellence Award at Lucknow Smart City Summit

Commissioner KMC Received an Excellence Award at Lucknow Smart City Summit

 

 

 

 

 

కాకినాడ నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ కె.రమేష్ గారు ఈరొజు లక్నో నగరంలో జరుగుచున్న స్మార్ట్ సిటి సమ్మిట్ లో వారి యొక్క ఆహ్వానం మేరకు పాల్గోనినారు .సదరు స్మార్ట్ సిటి సమ్మిట్ లో కాకినాడ నగరంలో స్మార్ట్ సిటి ప్రోజక్ట్ లో భాగంగా నగరపాలక సంస్థ ఆధీనంలో గల ఉన్నత పాఠశాలల్లో అన్ని వసతుల కల్పన మరియు సాంకేతిక అభివృద్ధి నిమిత్తం 65తరగతి గదులలో డిజిటల్ మరియు వర్చువల్ పరిజ్ఞానం ద్వారా విధ్యభోదనను చేయుట వాల్ల షుమారు 15000 మంది విద్యార్ధిని ,విద్యార్ధులకు విధ్యను అందించుట జరుగుచున్నది. సదరు విషయములను పురస్కరించుకొని కాకినాడ స్మార్ట్ సిటి కార్పోరేషన్ లిమిటెడ్ ను గౌరవించుచు కమీషనర్ కాకినాడ నగరపాలక సంస్థ మరియు ఎం.డి.( KSCCL ) ను అభినందించారు.సదరు అభినందన పురస్కారంను (excellence award) మరియు ధృవపత్రం ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక మరియు కుటుంబ సంక్షేమ మంత్రి వర్యులు రీటా బహుగుణ గారు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖా అమాత్యులు జగ్ ప్రతాప్ సింగ్ గారు, భారత ప్రభుత్వ నగర,నితిఅయోగ్,సంచాలకులు శ్రీ ఎస్.కె.సింగ్ గారు మరియు ఇతర అతిరధ మహారధుల చేతుల మీదుగా ఈ పాఠశాల తరగతులు ద్వారా విధ్యభోదనను చేయించుటలో కృషి చేసినందులకు గాను సదరు అవార్డును బహుకరించినారు.

Advertisement

Share this content.