• కాకినాడ కార్పొరేషన్ నందు ప్రభుత్వ ప్రతిష్ట్మాక కార్యక్రమములో భాగంగా కాకినాడ కార్పోరేషన్ నందు గృహనిర్మాణము పధకములో భాగంగా నిర్మించతలపెట్టిన పట్టణ గృహనిర్మాణ సంబంధించిన పనులను పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా కాకినాడ నగర పరిధిలోని పర్లోపేట నందు నిర్మాణములో ఉన్న పట్టణ గృహనిర్మాణమునకు సంబంధించిన మౌలిక సదుపాయములైన త్రాగునీరు విధ్యుత్, డ్రైనేజి పనులు పరిశీలించి గృహనిర్మాణ పనులు వేగవంతంచేయాలని, అదేవిదముగా ఏటిమొగ ప్రాంతం నందు సుమారు ఏడు ఎకరముల స్ధలములో గృహనిర్మాణములు చేపట్టుటకు అవసరమైన చర్యలు చేపట్టవలసినదిగా అదేశించియున్నారు. ఈ యొక్క పరిశీలనలో ఆర్.డి.వో జి.రాజకుమారి వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టిడ్కొ రీటా, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టిడ్కొ కె.రాజు తదితరులు పాల్గొన్నారు.