• రాష్ర వ్యవసాయ, సహకార శాఖామాత్యులు కురసాల కన్నబాబు సోదరుడు కురసాల సురేష్ బాబు అకాల మరణం చెందిన కారణంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖామాత్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నాని శనివారంనాడు కాకినాడలోని వ్యవసాయ మంత్రి స్వగృహంలో ఆయనను కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రులు ఇరువురు మాట్లాడుతూ సురేష్ బాబు చిన్న వయస్సులోనే అకాల మరణం చెందడం చాలా బాధాకరమని, ఈ విషాదం నుండి వారి కుటుంబ సభ్యులు బయట పడేలా భగవంతుడు వారికి ధైర్యం ఇవ్వాలని, వారు వ్యవసాయ శాఖా మంత్రిని పరామర్శించి, వారి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. శనివారంనాడు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన వారిలో గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం, అమలాపురం ఎం.పి. చింతా అనురాధ, జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుంకర పావని, జాయింట్ కలక్టర్ లక్ష్మిశ, కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు, అనంతపురం శాసన సభ్యులు పెద్ది రెడ్డి, మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు, కొప్పన మోహన రావు, మాజీ శాసన సభ్యులు వనమాడి వేంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, ఎన్.శేషారెడ్డి, తదితరులు మంత్రిని కలిసి సానుభూతిని తెలియజేశారు.