• Tags
 • Dist Collector D.Muralidhar Reddy participated change of Indian Red Cross Society Old Building to Building at Gandhi Nagar, Kakinada.

   
      రాష్ట్రంలోని 13 జిల్లాలో ప్రత్యేక స్థానం ఉన్న తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు.
  మంగళవారం కాకినాడలోని రెడ్ క్రాస్  సంస్థ పాత భవనం నుండి నూతన భవనం లో బదిలీల్లో భాగంగా కలెక్టర్ డి .మురళీధర్రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
     ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తలసీమియా వ్యాధి గ్రస్తులకు తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అందిస్తున్న సేవలను  కొనియాడారు.
  రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధానంలో కొత్త పాలసీని తీసుకు రాబోతున్న నేపథ్యంలో పోషన్ అభియాన్ కింద వెయ్యి రోజుల కార్యక్రమం చేపట్టిందన్నారు. శిశువు గర్భంలో పడి నప్పడి నుండి వేయి రోజులపాటు ఈ పథకం కింద బిడ్డకు పూర్తి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపడతారని అన్నారు. ముఖ్యంగా పౌష్టికాహారం అందించడం పిల్లల ఎదుగుదల లో ఉన్న మార్పులను గుర్తించడం వంటి కార్యక్రమాలు ఈ పథకం ద్వారా అమలు చేయనున్న ర న్నారు.
  రెడ్ క్రాస్ సంస్థ ద్వారా 136 మంది పిల్లలకు తలసీమియా తో బాధపడుతున్న వారికి అవసరమైన హేమోగ్లోబిన్ అందించటం  తో పాటు తగిన వైద్య సేవలు ఇస్తున్నారని కలెక్టర్ తెలిపారు.    రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి వివిధ సంస్థలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఇందులో భాగంగా రెడ్ క్రాస్ భవనంలో సోలార్ విద్యుత్  ఏర్పాటుకు కాకినాడ సీ పోర్టు ముందుకువచ్చి 11 లక్షల 25 వేల రూపాయలు చెక్కు అందించడం శుభ పరిమాణం అన్నారు. రెడ్ క్రాస్ సేవలందిస్తున్న  హోప్ , సూర్య గ్లోబల్ హాస్పిటల్, ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.
  ఈ సందర్భంగా తలసీమియా వ్యాధి గ్రస్తులకు వైద్య సేవలు అందించడంతో పాటు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఏజెన్సీ ప్రాంత  గర్భిణీ మహిళలకు విటమిన్ గల మందులను పంపిణీ చేశారు.  సంస్థ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని ఉన్న గర్భిణీ స్త్రీలకు 4వేల మందికి విటమిన్ మాత్రలు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అంద చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
  జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వై .డి .రామారావు మాట్లాడుతూ ఆరు పడకల గా ఉన్న  సంస్థ  18 పడకల గా మారడం లో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అందిస్తున్న సహకారాన్ని అభినందించారు.
  ఈ కార్యక్రమంలో కాకినాడ సీఫుడ్ సీఈఓ మురళీధర్, హోప్ హాస్పిటల్ అధినేత రవికుమార్ రాజు, సూర్య గ్లోబల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వీర్రాజు, ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి సతీష్  ,డీఎంహెచ్వో డాక్టర్ సత్య సుశీల ,రెడ్ క్రాస్ సంస్థ సెక్రెటరీ కేశవకుమార్ ,డాక్టర్ డి .రాజు, డాక్టర్ పరాస్ తదితరులు పాల్గొన్నారు.